న్యూఢల్లీి: జాక్ పాట్ అంటే ఇదీ. కెనడా విద్యార్థి ఒకరికి లాటరీలో తొలి ప్రయత్నం లోనే అదృష్టం వరించింది. వందల కోట్ల రూపాయల లాటరీని గెల్చుకుంది. అంతేకాదు ఇంతపెద్ద లాటరీ గెలుచుకున్న దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది 18 ఏళ్ల జూలియెట్ లామర్. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 287 కోట్ల రూపాయలు (48 మిలియన్ కెనడియన్ డాలర్లు లేదా 35.8 అమెరికా మిలియన్ డాలర్లు) జాక్‌ఫాట్ కొట్టేసింది.వివరాల్లోకి వెళితే జూలియెట్ లామర్ సాల్ట్ స్టీలోని అల్గోమా విశ్వవిద్యాలయంలో విద్యార్థి. ఏదో సరదాగా అంటారియో ఒట్టో లాటరీ అండ్ గేమింగ్ కార్పొరేషన్‌కు చెందిన లాటరీని కొనుగోలు చేసింది. అదీ 18వ పుట్టిన రోజు సందర్భంతా తాత కోరిక, తండ్రి సలహా మేరకు లోట్టో 6/49 లాటరీ కొనుగోలు చేసింది. కానీ జాక్‌పాట్ వస్తుందని ఊహించలేదు. అసలు ఫలితాలు ప్రకటించే సమయానికి జూలియట్ లామర్ ఆ టిక్కెట్ గురించి దాదాపు మర్చిపోయింది కూడా. తీరా వచ్చాక సంతోషం పట్టలేక భావోద్వేగానికి లోనైంది.తన తొలి లాటరీ టిక్కెట్‌పై గోల్డ్ బాల్ జాక్‌పాట్ ..ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని లామర్ పేర్కొంది. మనీ మేనేజర్, తండ్రి సహాయంతో గెలుపొందిన మొత్తంలో ఎక్కువ భాగాన్ని జాగ్రత్తగా పెట్టుబడి పెడతానని పేర్కొంది. ముఖ్యంగా డాక్టర్ కావాలనే తన కల నెరవేర్చుకోవడానికి గెలిచిన మొత్తంలో కొంత పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందట.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!