దసరా మూవీ విషయంలో ట్రోల్స్ రావడంపై స్పందించారు హీరో నాని. ఈ చిత్రాన్ని తాను ఎందుకు ఆర్ఆర్ఆర్, కేజీయఫ్2లతో ఎందుకు పోల్చారు వివరించారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం దసరా. కీర్తి సురేశ్ కథానాయిక. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. మరోవైపు ఈ చిత్రం పుష్ప కాపీ అంటూ కూడా ట్రోల్స్ వచ్చాయి. ఇకపోతే ఇటీవలే నాని ఈ చిత్రాన్ని కేజీయఫ్, ఆర్ఆర్ఆర్తో పోలుస్తూ కామెంట్స్ చేయడం వైరల్‌గా మారింది. అయితే వీటిపై నాని స్పందించారు. తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సినిమాలో మీ లుక్ చూసి పుష్పలో అల్లు అర్జున్‌తో పోల్చుతున్నారు. ట్రోల్స్ కూడా చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు.. అని అడగగా… ‘‘ఈ పదేళ్లలో ఓ ఐదు వందల సినిమాలు వచ్చాయి అనుకోండి. అందులో 495 సినిమాలలో హీరోలంతా ప్యాంటు, షర్ట్‌లోనే కనిపిస్తారు. అలాగని వాళ్ళనెప్పుడు సేమ్ లుక్ అని అనలేం. లుంగీ, బనియన్‌తో రూరల్ సినిమాలు చాలా రేర్?గా చేస్తుంటాం. చివరి సారిగా బన్నీతో సుకుమార్ పుష్ప తీశారు. ఇక్కడ అలాంటి గెటప్ కలిసేసరికి సేమ్ అనేస్తున్నాం. ఎందుకంటే.. ఇలాంటివి ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చి ఉంటే.. ఈ కంపారిజన్స్, రిఫరెన్స్‌లు ఉండేవి కాదు. పక్కా ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. దసరాను ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ రేంజ్ సినిమాలతో పోల్చారు? ఎందుకలా.. ‘‘ఈ ప్రశ్నపై నేను అందరికి క్లారిటీ ఇవ్వాలి. మేం ఏం చెప్తామో దాన్ని కొన్ని సార్లు మరో రకంగా తీసుకుంటారు. నేను ఏం చెప్పానంటే.. ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ లాగా అంటే 500 కోట్లు, 1000 కోట్లు వస్తాయి అని కాదు.. అవి ఆయా ఇండస్ట్రీలు గర్వించదగ్గ సినిమాలు. ప్రతి ఏడాది ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో ఆణిముత్యం వస్తుంది. ఇది మా ఇండస్ట్రీ మూవీ, దీన్ని మేము చేశాం అని చెప్పుకునే సినిమాలు ఉంటాయి. అలా గతేడాది ఆర్ఆర్ఆర్, కేజీయఫ్లు వచ్చాయి. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ నుంచి రాబోతున్న అలాంటి ఆణిముత్యం సినిమా దసరా అని అప్పుడు అన్నాను’’ అంటూ నాని వివరించారు. ఈ చిత్రానికి ఏదైనా అవార్డు ఆశిస్తున్నారా అని అడగగా.. ‘‘వద్దండీ.. ఇప్పటికే చాలా ఉన్నాయి ఇంట్లో. నేను మీ ప్రేమనే కోరుకుంటున్నా. అదే చిరస్థాయిగా ఉంటుంది. ఎవరైనా అవార్డు ఇస్తే మాత్రం వద్దనకుండా తీసుకుంటా. ఇక కీర్తి సురేశ్‌తో మరోసారి కలిసి నటించడం మంచి అనుభవం. మేం గతంలో నేను లోకల్ సినిమాలో కలిసి నటించాం. అందులోని పాత్రలను గుర్తుచేస్తూ మమ్మల్ని పొట్టి, బాబు అని ఇప్పటికీ పిలుస్తున్నారు. మార్చి 30 నుంచి ఆ పేర్లు వినిపించవు. ధరణి, వెన్నెల పేర్లే వినిపిస్తాయి. ఇకపై దీన్ని బ్రేక్ చేయాలం టే చాలా కష్టం.’’ అని అన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!