గత కొంత కాలంగా సినీ సెలబ్రిటీలు రక రకాల వ్యాధులతో బాధపడుతూ షాకిస్తున్నారు. కొంత మంది క్యాన్సర్ కు గురవుతుంటో మరి కొంత మంది మానసిక సమస్యలతో బాధపడుతూ ట్రిటమ్మెంట్ తీసుకుంటున్నారు. ఇందులో హీరోయిన్ లే అత్యధిక శాతం వివిధ వ్యాధులతో బాధపడుతుండటం గమనార్హం. మమతా మోహన్ దాస్ హంసా నందిని సొనాలి బింద్రే బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడి విజయవంతంగా ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పుడు కొత్తగా సమంత సపోర్టింగ్ ఆర్టిస్ట్ కల్పిక గణేష్ మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నామని చెప్పడం పలువురిని షాక్ కు గురిచేసింది. మయోసైటీస్ కారణంగా తాను బాధపడుతున్నానని ఆ మధ్య సోసల్ మీడియా వేదికగా వెల్లడిరచి బావోద్వేగానికి గురి కావడం ఆమె అభిమానులతో పాటు సెలబ్రిటీస్ ని కంటతడి పెట్టించింది. ప్రస్తుతం కోలుకున్న సమంత బాలీవుడ్ లో సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకె దీన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ ముంబాయిలో జరుగుతోంది. ఇదిలా వుంటే తాజాగా రేణుదేశాయ్ షాకింగ్ పోస్ట్ తో సోషల్ మీడియా వేదికగా తాను కూడా గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాని వెల్లడిరచడం షాక్ కు గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా తను తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని వెల్లడిరచింది. తన పరిస్థితి ఏమీ బాగాలేదని స్పష్టం చేసింది. గత కొంత కాలంగా తాను పోరాడుతున్నానని తెలిపింది. నా శ్రేయోభిలాషులందరికీ ఓ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. నేను కొన్నేళ్లుగా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాను. ఎలాంటి ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నానో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నేను వాటిని ఎదుర్కొనేందుకు ఎంతటి శక్తిని కూడగట్టుకుంటున్నానో మీకు చెప్పాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా ఈ విషయాలన్నీ చెప్పేందుకు ఓ కారణం వుంది. నాలా ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసేందుకు చెబుతున్నాను. మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఒక రోజు మనకు ఫలితం వస్తుంది. ఎప్పటికీ ఆశను కోల్పోవద్దు. నిరుత్సాహపడొద్దు. జీవితం మీద మన మీద మనకు నమ్మకం వుండాలి. ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్ ప్రైజ్ లను ప్లాన్ చేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నవ్వుతూ వాటిని ఎదుర్కోవాలి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది. మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. పోషకాహారాన్ని తీసుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ మామూలు మనిషిలా తిరిగి వస్తాను. షూటింగ్ లో పాల్గొంటాను అంటూ తెలిపింది. రేణుదేశాయ్ ప్రస్తుతం రవితేజ మీరోగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావులో నటిస్తోంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!