Hyderabad Traffic Restrictions: మిలాద్– ఉన్– నబీ.. సందర్భంగా పాతబస్తీలోట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ పోలీసులు. ఆంక్షలతో పాటు.. ర్యాలీ నిర్వహించే రోడ్డు మార్గాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు దక్షిణ మండలం పోలీసు అధికారులు. ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే మిలాద్– ఉన్– నబీ సందర్భంగా ఓల్డ్ సిటీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించనున్నారు మత పెద్దలు.
మిలాద్– ఉన్– నబీ.. సందర్భంగా పాతబస్తీలోట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ పోలీసులు. ఆంక్షలతో పాటు.. ర్యాలీ నిర్వహించే రోడ్డు మార్గాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు దక్షిణ మండలం పోలీసు అధికారులు. ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే మిలాద్– ఉన్– నబీ సందర్భంగా ఓల్డ్ సిటీలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించనున్నారు మత పెద్దలు. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పాతబస్తీలోని వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ర్యాలీ వెళ్తున్న మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడంతో పాటు ప్రజలు వేరో మార్గాలు ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య మత పెద్దలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరికాసేపట్లో జరగబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. మత పెద్దలు కూడా పోలీస్ ఆదేశాలను పాటిస్తూ ర్యాలీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. యువకులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని మత పెద్దలు కోరారు. మరోవైపు వాహనాలు వేగంగా తోలడం, టపాసులు పేల్చడం డీజే పెట్టి భారీ సౌండ్ లాంటిది చేయకూడదని మత పెద్దలు యువతను సీరియస్ గా విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ చేయడం, బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్న యువకులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని మత పెద్దలు విజ్ఞప్తి చేస్తూనే.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిమర్జనం రోజే మీలాదున్నబి జరుపుకోవాల్సింది. మీలాద్ నిమజ్జనం ఒకేరోజు రావడంతో.. ముస్లిం మత పెద్దలు తమ నిర్ణయాన్ని మార్చుకుంటూ అక్టోబర్ ఒకటో తేదీ నిర్వహించుకుంటామని పోలీసు అధికారులకు హామీ ఇవ్వడంతో ఈ రోజు మీలాద్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక పాతబస్తీ విషయానికి వస్తే ఈనెల మొత్తం అన్నదాన కార్యక్రమాలతో పాటు హిందువులు, ముస్లింపు ప్రత్యేక సామూహిక సాంప్రదాయ సభలు నిర్వహించడం ఆనవాయితి. రాత్రి నుంచి పాత బస్తి లోని గల్లీ గల్లీలో బిర్యాని వంటకాలతో విందులు ప్రారంభమయ్యాయి. మరి కాసేపట్లో జరగబోయే మీలాద్ ర్యాలీలో నగరంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువకులు పాల్గొని చార్మినార్ నుంచి బయలుదేరి నయాపూర్ నుంచి సాలార్జంగ్ మ్యూజియం మీదగా మొగల్ పురా వరకుకొనసాగుతుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభతో ఈ ర్యాలీ ముగుస్తుంది. ఈ సామూహిక ర్యాలీలో పాతబస్తీకి చెందిన సుమారు 40 ముస్లిం సంస్థలు పాల్గొంటాయి.