నగరంలో ఏ చిన్న చినుకుపడిన అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. వర్షం పడిందంటే చాలు నగరవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ ఏ నాళా గుంత తెరుచుకొని ఉందో తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా తరచూ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు మృత్య వాత పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో కురిసినటువంటి వర్షాలకు కాను గాంధీనగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళ..
నగరంలో ఏ చిన్న చినుకుపడిన అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. వర్షం పడిందంటే చాలు నగరవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ ఏ నాళా గుంత తెరుచుకొని ఉందో తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా తరచూ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు మృత్య వాత పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ మధ్యకాలంలో కురిసినటువంటి వర్షాలకు కాను గాంధీనగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. ఇంట్లో నుండి బయటకు వచ్చిన లక్ష్మీ ఒక్కసారిగా పక్కనే ఉధృతంగా ప్రవహిస్తున్న మూసిలో పడిపోయింది. అనంతరం లక్ష్మీ వరద ఉదృతికి కొట్టుకొని పోయింది. సీసీ కెమెరాలలో లక్ష్మీ వెళ్లిన దృశ్యాలు కనిపించగా తరువాత లక్ష్మీ ఆచూకీ ఎక్కడ కనిపించలేదు. 4 రోజుల పాటు లక్ష్మీ మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తరువాత కురిసిన భారీ వర్షాలకు గాను మృతదేహం మూసిలో నాలుగు రోజుల తర్వాత ప్రత్యక్షమైంది. ఈ ఘటన మరువక ముందే నగరంలో మరొక విషధాకరమైన ఘటన చోటుచేసుకుంది. నాలుగు సంవత్సరాల బాలుడు మిథున్ రెడ్డి ప్రమాదవశాత్తు నాళాలోపడిపోయాడు. నిన్న నగరంలో వర్షం కురవగా.. వర్షం కాస్త తెరపి ఇవ్వడంతో ఇంట్లో నుంచి మిథున్ బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఇంటి ముందు తెరుచుకొని ఉన్న నాలాలో పడిపోయాడు. అది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు మిథున్ కోసం గాలించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడు నాళాలో పడిపోయిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. మిథున్ మృతదేహం నాలాలో కొట్టుకొచ్చి రాజీవ్ గృహకల్ప వద్ద చెరువులో లభ్యమయింది.
ఇలా ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా ఎవరో ఒకరు మృత్యవాతపడుతున్నారు. తాజాగా మెట్టుగూడాలో నాళాలో ఓ మహిళ మృత్యువాత పడింది. నాళా ఉధృతంగా ప్రవహిస్తుండగా బ్రిడ్జి కింద నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా ఒక్కసారి ఉదృతి పెరగడంతో కొట్టుకొనిపోయింది. అనంతరం అంబానగర్ మహళ మృతదేహం తేలింది. మృతురాలిని జీహెచ్ఎమ్సీలో పని చేసే మహిళగా పోలీసులు గుర్తించారు.