Hyderabad Rains: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ మహా నగరం అతలాకుతలమైంది. దీంతో పాములు, మొసళ్లు జనవాసాల్లోకి చేరాయి. ఇవి పలు ప్రాంతాల్లో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో బుధవారం కురిసిన భారీ కురిసిన వర్షానికి.. నాలాలో ఓ మొసలి కనిపించడం అలజడి రేపింది. ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ – చింతల్‌బస్తీ మధ్య కొత్తగా నిర్మిస్తున్న వంతెన వద్ద మొసలి పిల్ల ప్రత్యక్ష్యమైంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ మహా నగరం అతలాకుతలమైంది. దీంతో పాములు, మొసళ్లు జనవాసాల్లోకి చేరాయి. ఇవి పలు ప్రాంతాల్లో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో బుధవారం కురిసిన భారీ కురిసిన వర్షానికి.. నాలాలో ఓ మొసలి కనిపించడం అలజడి రేపింది. ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ – చింతల్‌బస్తీ మధ్య కొత్తగా నిర్మిస్తున్న వంతెన వద్ద మొసలి పిల్ల ప్రత్యక్ష్యమైంది. బుధవారం సాయత్రం కురిసిన భారీ వర్షానికి వరదకు బల్కాపూర్ నాలాలో వరద ఉధృతి పెరగడంతో మొసలి కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నారు.
అయితే నాలాలో కొట్టుకువచ్చిన మొసలి పిల్లను చూసి జనం భయాందోళనకు గురయ్యారు. సెడన్‌గా మొసలిని చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చే లోపే మొసలి పక్కనే ఉన్న నాలాలోకి దూసుకెళ్లిందింది. అదే దారిలో గణేష్ మండపం ఉండటంతో స్థానికుల్లో మరింత భయం అలుముకుంది. అయితే మొసలి నాలా గోడలు, మెటల్ రాడ్ల మధ్య ఇరుకైన మార్గంలో ఇరుక్కుపోయింది. రాత్రి 7 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు మొసలిని రెస్క్యూ చేసేందుకు చాలా గంటల సమయం పట్టింది. పోలీసు, అటవీ, DRF కి చెందిన దాదాపు 20 మంది అధికారుల బృందం మెటల్ రాడ్లను మధ్య ఉన్న మొసలిని బయటకు తీయడానికి చాలా సేపు శ్రమించారు.
ఎట్టకేలకు మొసలిని పట్టుకొని జూకి తరలించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నాలపై నిర్మాణ పనులు మూడు నెలలు గడుస్తున్న పూర్తి కాకపోవడం, అదే ప్రాంతంలో మొసలి పిల్ల కొట్టుకురావడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలాల్లో ముసలి పిల్ల ఒకటే ఉందా? లేక దాని తల్లి ఏమైనా ఉందా..? ఇంకా ఎన్ని కొట్టుకు వచ్చాయి? అనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ముసలి పిల్ల ప్రస్తుతం ఎక్కడ నుంచి కొట్టుకు వచ్చిందని దానిపై అధికారులు దృష్టి పెట్టారు.
అయితే, అంతకుముందు కూడా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మొసళ్లు, పాములు కనిపించాయి. తాజాగా.. కురిసిన భారీ వర్షంతో మొసలి కనిపించడం స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా.. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణ కేంద్రం ఎలో అలర్ట్ జారీ చేసింది.