మరీ ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొన్నటి మొన్న కోకాపేట్లో ఎకరం రూ. వంద కోట్లకు అమ్ముడుపోయి ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. దేశంలో ఒక ఎకరం ఇంత మొత్తానికి అమ్ముడుపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాకుండా హైదరాబాద్‌కు నలుమూలల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. విదేశీ పెట్టుబడి దారులు, మరీ ముఖ్యంగా తెలుగు…
భూమిపై పెట్టుబడి పెట్టిన వారు ఎప్పటికీ నష్టపోరు అనే ఒక నానుడి ఉంది. జనాభా రోజురోజుకీ పెరుగుతుంది కానీ పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా భూమి మాత్రం పెరగదు అనేది అక్షర సత్యం. అందుకే భూమికి ఉన్న విలువ మరేదానిఇక ఉండదని చెబుతుంటారు. రియల్ ఎస్టేట్ రంగం ఓ రేంజ్లో అభివృద్ధి చెందుతుండడానికి ఇదే ప్రధాన కారణం.
మరీ ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొన్నటి మొన్న కోకాపేట్లో ఎకరం రూ. వంద కోట్లకు అమ్ముడుపోయి ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. దేశంలో ఒక ఎకరం ఇంత మొత్తానికి అమ్ముడుపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాకుండా హైదరాబాద్‌కు నలుమూలల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. విదేశీ పెట్టుబడి దారులు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతుండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
కొలియర్స్ ఇండియా అనే సంస్థ.. ఇటీవల భారత్‌లో భూముల కొనుగోళ్లలో అగ్ర స్థానంలో ఉన్న పట్టణాల జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్ 5 కారిడార్లలో హైదరాబాద్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. భారత్‌లో భూములపై పెట్టుబడులు పెట్టడానికి అనువైన నగరాల్లో హైదరాబాద్ ఒకటని ఈ సంస్థ తెలిపింది. కొలియర్స్ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్‌లోని మేడ్చల్, కొంపల్లి, శామీర్‌పేట్ ప్రాంతాలు పెట్టుబడులకు అనువైన ప్రాంతాలుగా తెలిపింది. ఈ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో ఢోకా ఉండదని తెలిపింది.
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో భూములపై పుట్టుబడులు పెట్టిన వారికి వచ్చే పదేళ్లలో మూడు రెట్లు రిటర్న్స్ పొందొచ్చని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని నేరల్, మాతేరన్, గుజరాత్‌లోని సనంద్, నల్సరోవర్ భూములు పెట్టుబడులకు టాప్-5 కారిడార్లుగా కొలియర్స్ ఇండియా తెలిపింది. ఈ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టిన వారికి కూడా మంచి లాభాలు ఖాయమని కొలియర్స్ ఇండియా తన నివేదికలో పేర్కొంది.