పాల్గొన్న వేలాదిమంది భక్తులు.
వేపాడ,మార్చి,31(ఆంధ్ర పత్రిక ):- మండలంలోని అరిగిపాలెం గ్రామంలో గురువారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించగా, స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి భారీ అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ అన్నసంతర్పణకు చుట్టుపక్కల గ్రామాలైన సోంపురం,తోటకల్లాలు,జాకేరు, జగ్గయ్యపేట, గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాలను స్వీకరించి ఆయన కృపకు పాత్రులైనారు.ఈ అన్న సమారాధన కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు బూరెలను వండి పెట్టారు. అలాగే గ్రామస్తులు ఎవరికి తోచింది వారు సమకూర్చి అన్నసంతర్పణ కార్యక్రమానికి సహకరించారు.కాగా గ్రామంలో యువకులు భారీగా చేరుకొని ఈ అన్న సమారాధన కార్యక్రమానికి వారి వంతు సేవలను అందించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సర్పంచ్ దంపతులు దుల్ల, లక్ష్మి,సన్యాసిరావు,ఎంపీటీసీ సభ్యులు తొండవరపు వెంకటరమణ,ఉప సర్పంచ్ ముక్కా సన్యాసరావు, మాజీ సర్పంచులు హనుమంతు సన్యాసిరావు,పడాల వెంకటరమణ,మాజీ ఎంపీటీసీ దుల్ల వెంకటరావు, వార్డు మెంబర్ హనుమంతు కృష్ణ,దుల్ల నాయుడు బాబు,నాగరాజు,గండి పడాల వెంకటరమణ,ముక్కా శ్రీను,అప్పల ఈశ్వరరావు,చిన్నం నాయడు,సత్తిబాబు, ముమ్మన నరసింహనాయుడు,ఇర్ర సన్యాసిరావు,ఏడువాక విశ్వనాథం,శ్రీనివాసరావు, గుంట్రుతు ముత్యాలు,ఇమంది సన్యాసిరావు,ఉత్తుపులుసు ఈశ్వర అప్పారావు, దొంతుల అప్పారావు,వాలెంటర్ పడాల కాళీ, ఎప్.ఏ రాంబాబు,మరి కొంతమంది యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!