Gold Rate Today September 24 : దేశంలో బంగారం ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 10 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 69,810కి చేరుకుంది.
సోమవారం ఈ ధర రూ. 69,800గా ఉండేది. ఇక 100 గ్రాముల బంగారం ధరరూ. 100 పరిగింది రూ. 6,98,100కు చేరుకుంది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం రూ. 6,981గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 పెరిగి రూ. 76,160గా కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ. 76,150గా ఉంది. అదే సమయంలో వంద గ్రాముల బంగారం ధరరూ. 100 పెరిగింది. రూ. 7,61.600గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 7,616గా ఉంది.
దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం ధరలు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,960గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 76,310గా ఉంది. కోల్ కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,810గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 76,160గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,810గా కొనసాగుతుంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 76,160గా నమోదు అయ్యింది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక దేశంలో వెండి ధరలు మంగళవారం పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి రూ. 92090గా ఉంది. కిలో పై రూ. 100 పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 97,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్ కతాలో రూ. 92,900, బెంగళూరులో రూ. 84,900గా ఉంది.