HMD Skyline | ఇంటర్నెట్ డెస్క్: నోకియా బ్రాండ్‌పై ఫోన్లను తయారుచేసే ఫిన్లాండ్కు చెందిన హెచ్ఎండీ (HMD) సంస్థ సొంత బ్రాండ్‌పై కొత్త స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది.
హెచ్ఎండీ స్కైలైన్ (HMD Skyline) పేరిట ఆవిష్కరించింది. డిస్ప్లే, బ్యాటరీని రీప్లేస్ చేసే సదుపాయంతో ఈ ఫోన్‌ను తీసుకురావడం గమనార్హం. ఆకర్షణీయమైన లుక్‌తో తీసుకొచ్చిన మొబైల్ ధర, ఫీచర్ల వివరాలు ఇవే..
హెచ్ఎండీ కొత్త ఫోన్ కేవలం ఒక వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.35,999గా కంపెనీ నిర్ణయించింది. నియోన్ పింక్, ట్విస్టెడ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్, హెచ్ఎండీ వెబ్సైట్లో పాటు ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పోలెడ్ స్క్రీన్ ఇచ్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేటు, 1,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ అమర్చారు. ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది.
హెచ్ఎండీ స్కైలైన్‌లో వెనకవైపు 108 ఎంపీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ టెలీఫొటో సెన్సర్, 13ఎంపీ సెన్సర్‌ను అమర్చారు. ముందువైపు సెల్ఫీ కోసం 50ఎంపీ సెన్సర్ ఇచ్చారు. కస్టమ్ బటన్‌తో దీన్ని తీసుకొచ్చారు. సెల్ఫ్ రిపేర్ కిట్‌తో వస్తోంది. అంటే డిస్ప్లే డ్యామేజ్ అయినప్పుడు బ్యాక్ ప్యానల్ సాయంతో డిస్ప్లేని మార్చుకొనే సదుపాయం ఉందని కంపెనీ చెబుతోంది. 4,600mAh బ్యాటరీ, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఛార్జర్‌తో రాదు. వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్ యూఎస్బీ టైప్- సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.