విశాఖ: జిల్లాలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల వద్ద పనుల నిలుపుదలకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇక్కడి తవ్వకాలపై ఇటీవల ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది.
జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్, మత్స్యకార నాయకుడు శంకర్ ఇందుకు సంబంధించి పిల్ దాఖలు చేశారు. దిబ్బలు తవ్వుతున్న ప్రదేశం వారసత్వ సంపద పరిధిలోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా సొసైటీ పనులు చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈక్రమంలో పనులు నిలపాలని జీవీఎంసీ, ఇతర సంబంధిత శాఖలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.