భీమవరం జనవరి 5( ఆంధ్ర పత్రిక) ; భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రరాయ్ దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. ముందుగా గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మావుళ్ళ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ మానవేంద్రరాయ్ తో పాటు , భీమవరం కోర్టుల న్యాయమూర్తులను ఆలయం మర్యాదలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు, మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం పాలకమండలి సభ్యులు రామాయణం సత్యనారాయణ ముత్యాల వెంకట రామారావు తాళ్లపూడి భాగ్యలక్ష్మి, గోపిశెట్టి విజయలక్ష్మి, నీలాపు విజయ నాగలక్ష్మి,, కోయి వెంకటలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, భీమవరం కోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!