యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ యాడ్‌కు సంతకం
నవంబర్ 11 (ఆంధ్రపత్రిక): పేరున్న నటులంతా ఇప్పుడు కమర్షియల్ బ్రాండ్లకు ప్రచార కర్తలుగా మారుతున్నారు. ఓ పక్క సినిమాల్లో సంపాదిస్తూనే క్రేజ్‌ని బట్టి కమర్షియల్ బ్రాండ్లకు ప్రచార కర్తలుగా మారి హోరెత్తిస్తున్నారు. ’పుష్ప’ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ అల్లు అర్జున్ పలు బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. మ్యాంగో ఫ్రూటీ యాడ్ నుంచి రాపిడో వరకు బన్నీ పలు కమర్శియల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా మారిపోయి వాటికి సంబంధించిన యాడ్లలో నటించడం మొదలు పెట్టాడు. ఈ రేసులో మొదటి నుంచి ముందు వరుసలో నిలుస్తున్న మహేష్ బాబు ఈ మధ్య కాస్త జోరు తగ్గించడంతో బన్నీ లైన్లోకి వచ్చేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ భారీ క్రేజ్‌ని ఫ్యాన్ బేస్‌ని దక్కించుకుని వార్తల్లో నిలిచారు. అయితే ఈ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్ ని బన్నీ తరహాలో కమర్షియల్ యాడ్లకు వాడు కోలేకపోతున్నారని ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా ఫీలవతున్నారు. ఇటీవలే రామ్ చరణ్ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ కమర్శియల్ యాడ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా వరుసగా వాటిల్లో నటించాడు కూడా. అయితే ఎన్టీఆర్ మాత్రం తన 30వ ప్రాజెక్ట్ ప్రారంభం కోసం ఎదురుచూస్తూ క్రేజ్‌ని క్యాష్ చేసుకోలేకపోతున్నాడు. గత ఐదారు నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసమే ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఎట్టకేలకు కమర్షియల్ యాడ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తను కూడా రంగంలోకి దిగేశాడని తెలిసింది. ఫాంటా యాడ్ లో ఇంతకు ముందు నటించిన ఎన్టీఆర్ ఈ సారి భారీ డీల్‌ని కుదుర్చుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం ఈ యాడ్ షూట్లో పాల్గొంటున్నాడని తెలిసింది.