న్యూఢల్లీి,సెప్టెంబర్ 24(ఆంధ్రపత్రిక): దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢల్లీి, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీలోని గురుగ్రామ్‌లో రోడ్లు నీళ్లతో నిండిపో యాయి. వాహనాలు ఎక్కిడకక్కడ నిలిచిపోయాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉద్యో గులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చారు. భారీ వర్షాలకు ఉరుములు, గోడలు కూలడం, ఇళ్లు ధ్వంసం అవడం లాంటి ఘటనతో ఇప్పటివరకు 13 మంది చనిపోయారు. మరో 11 మందికి తీవ్ర గాయా లయ్యాయి. ఫిరోజాబాద్‌లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢల్లీిలో నూ వరద ప్రభావం కనిపిస్తోంది. ఢల్లీిలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఎక్స్ ప్రెస్ వేలో వరద నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు హర్యానాలో కూడా భారీగా వానలు పడుతున్నాయి. అంతేకాదు వచ్చే రెండ్రోజుల పాటు భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హర్యానాలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మోకా లి లోతు నీటిలోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిలిచిపో యాయి. పలు కాలనీలు జలదిగ్బంధమయ్యయాయి. వరదల వల్ల హైవేలపై భారీగా ట్రాఫిక్ జాం అవు తందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం తడిచిపోయిందని ఆవేదన చెందుతున్నారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా కైలాస మానససరోవరం యాత్రకు వెళ్లే రహదారిలో కొండ చరియలు విరిగిపడడంతో యాత్రికులు నిలిచిపోయారు. తవాఘాట్ జాతీయ రహదారి వద్ద సుమారు 40 మంది యాత్రికులు ఆగిపోయినట్లు అధికారులు వెల్లడిరచారు. నజాంగ్ తంబా గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చాలాచోట్ల రహదారులు స్తంభించిపోయాయి. రిషికేశ్`గంగోత్రి జాతీయ రహదారి కూడా బండ రాళ్లతో బ్లాక్ అయ్యింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!