చెన్నై,నవంబర్ 02 (ఆంధ్రపత్రిక): ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై మహా నగరం సహా పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతోకూడిన భారీ వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు నీట
మునిగాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. ప్రధాన రహదారులన్నీ వర్షపు నీటితో నదులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిరది. దీంతో ప్రజలు రాత్రంతా చీక ట్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. మరోవైపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ముందుగానే సెలవు ప్రకటించింది. ఉత్తర శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిరది. ఈశాన్య రుతుపవనాల వర్షాల కారణంగా రానున్న ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!