దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు(rains) కురియనున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సెప్టెంబరు 13-14 తేదీల్లో ఉత్తరాఖండ్(Uttarakhand)లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో తేలిక పాటి వర్షాలు కురియనున్నాయి. తూర్పు, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హర్యానాలో నేడు, రేపు, సెప్టెంబర్ 14 వరకు రాజస్థాన్‌లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
భారీ వర్షాలు
సెప్టెంబర్ 13న ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఒరిస్సా, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, త్రిపురలలో ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. బంగ్లాదేశ్‌పై ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్య భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.