Health Tips: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా మానవాళిని వేధిస్తున్న సమస్యలలో శ్వాసకోశ వ్యాధులు కూడా ఒకటి. ఇక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు కొన్ని రకాల..
Health Tips: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా మానవాళిని వేధిస్తున్న సమస్యలలో శ్వాసకోశ వ్యాధులు కూడా ఒకటి. ఇక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా ఆయా పదార్థాలను తినడం వల్ల సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందని, కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు: పాలు చాలా ఉపయోగకరంగా ఉన్నా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు చాలా హానికరం. ఈ సమస్య ఉన్నవారు పాలు తాగితే దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతాయి.
ఉప్పు: ఉప్పు ఆహారానికి రుచి కలిగేలా చేస్తుంది. అయితే అవసరం కంటే ఎక్కువ ఉప్పు శరీరానికి హాని చేస్తుంది. గొంతులో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఎదురయ్యే పరిస్థితికి దారి తీస్తుంది.
ఆల్కహాల్: శ్వాసకోశ రోగులు వైన్, బీర్కి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే సల్ఫైట్ శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది.
సోయా: శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు సోయా గింజలు, పాలకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే సోయా కారణంగా అలర్జీని కలిగిస్తుంది. ఫలితంగా సమస్య తీవ్రతరమవుతుంది.
చేపలు: నాన్ వెజ్ తినే శ్వాసకోశ రోగులు చేపలు తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే ఈ సమస్యలను తీవ్రతరం చేసే లక్షణాలు చేపలలో ఎక్కువగా ఉన్నాయని నిపుణులుచెబుతున్నారు.
వేరుశెనగలు: శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వేరుశనగలకు కూడా దూరంగా ఉండాలి. వేరుశెనగల వల్ల అలెర్జీ వస్తుంది. ఫలితంగా ఈ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది.