మచిలీపట్నం అక్టోబర్ 7 ఆంధ్ర పత్రిక. :
ప్రతి పేదవాడి ఆరోగ్య భద్రత జగనన్న ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని) అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష’ పథకం ద్వారా ప్రతి పేదవాడి ఆరోగ్య భద్రతను జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తీసుకుందని ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. స్థానిక వర్రెగూడెంలో నిర్వహించిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వైద్యాధికారులు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఆయన పలురకాల వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులు గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పేర్ని వెంకటరామయ్య(నాని) మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వం, ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండా లనే సంకల్పం తో జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో వైద్య పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్య, వైద్యానికి జగనన్న ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
వైద్య శిబిరంలో అత్యంత ప్రతిభా పాటవాలు కలిగిన డాక్టర్ల చే వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు అవసరమైన మందులు అందించడం జరుగుతుందని అన్నారు.
నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్ లు మనకు వరం అని అన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తొందన్నారు.
ఈ కార్యక్రమంలో వైసిపి యువ నాయకుడు యూత్ వింగ్ జోనల్ ఇంఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు ), డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి , పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.