దాదాపు మూడుకోట్లకు మోసం చేసిన దుండగులు
హైదరాబాద్,ఆగస్ట్13(ఆర్‌ఎన్‌ఎ): అడ్రస్ లేని కంపెనీల పేరు విూద కెనరా బ్యాంకు బాలానగర్ బ్రాంచ్ రెండున్నర కోట్లకు పైగా కేటుగాళ్లు టోపీ పెట్టారు. ఏఎఫ్ఎస్ కన్స్టక్షన్స్ర్ పేరుతో అడ్రస్ లేని సంస్థని సృష్టించారు. కెనరా బ్యాంకులో అహ్మద్ ఫయాజ్ అహ్మద్, మహ్మద్ చాంద్ పాషా అనే వ్యక్తులు 1.30 కోట్ల ఋణం తీసుకుని ఎగ్గొట్టారు. ఇదే తరహాలో తిరుమల ఎంటర్ ప్రైజెస్ సివిల్ ఇంజనీరింగ్ సంస్థను సృష్టించి 1.41 కోట్ల ఋణం తీసుకుని ప్రసాద్ రెడ్డి, మహాలక్ష్మి అనే ఇద్దరు వ్యక్తులు ఎగ్గొట్టారు. క్షేత్ర స్థాయి పరిశీలనతో మోసాలు వెలుగులోకి వచ్చాయి. సంస్థల కార్యాలయాలు, భాగస్వాముల చిరునామాలు అన్ని తప్పేనని, రుణ దరఖాస్తు కోసం ఫేక్ డాక్యూమెంట్స్ సృష్టించినట్లు నిర్దారణ అయ్యింది. సీసీఎస్‌లో కెనరాబ్యాంక్ బాలానగర్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!