హాసన్ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రమేయం ఉన్న లైంగిక కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం నిర్ణయించారు.
ప్రజ్వల్ దేశం విడిచి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వీడియో క్లిప్‌లో రేవణ్ణ ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని సిద్ధరామయ్య అన్నారు.
మహిళలపై లైంగిక వేధింపులు (బలవంతంగా) జరిగినట్లు కనిపిస్తోందని చెప్పారు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ పిటిషన్‌పై సిట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని సిద్ధరామయ్య తెలిపారు. ఏప్రిల్ 25న కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి, హాసన్‌లో వైరల్‌గా మారిన సెక్స్ వీడియోలపై ప్రత్యేక దర్యాప్తు కోరుతూ సిద్ధరామయ్య, రాష్ట్ర పోలీసు చీఫ్ అలోక్ మోహన్‌లకు లేఖ రాశారు.
ఈ క్లిప్‌లు ప్రజలకు చేరాయని నాగలక్ష్మి అన్నారు. ఇది సమాజం సిగ్గుతో తల దించుకునేలా చేస్తుందని చెప్పారు. వేలాది మంది మహిళలతో లైంగిక చర్యలకు పాల్పడిన దృశ్యాలు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు.లైంగిక చర్యలన్నింటినీ చిత్రీకరించిన వ్యక్తులతో పాటు వాటిని పబ్లిక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళ కమిషన్ కోరింది.
తన ప్రతిష్టను దిగజార్చేలా డాక్టరేటెడ్ వీడియోలు ప్రచారం చేస్తున్నారని ప్రజ్వల్ తన ఎన్నికల ఏజెంట్ ద్వారా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. సిట్ అధికారుల విచారణలో ఏ తెలుస్తుందో చూడాలి.