ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏరులై పారుతోంది
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల
జగిత్యాల,నవంబర్ 2 (ఆంధ్రపత్రిక): నల్లా తిప్పితే మంచినీళ్లు కాదు లిక్కర్ వస్తోందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణ మార్చారని మండిపడ్డారు. ఊరూరా బెల్ట షాపులే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజా ప్రస్థానం యాత్ర జగిత్యాలలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు పార్టీలు రాజకీయాలను బ్రష్టు పట్టిసు ్తన్నాయన్నారు. మతం పేరుతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధ్య క్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగని.. వీళ్లా పార్టీల అధ్యక్షులు అంటూ మండిపడ్డారు. తెలంగాణలో అసలు కేటీఆర్ ఎవడని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్‌కు స్థాయి ఎక్కడిదని నిలదీశారు. తనకు కేటీఆర్‌తో పోలికేంటని ప్రశ్నించారు. ’కేసీఆర్ ఇచ్చిన ఒక్క హావిూ అయినా నెరవేరిందా? బీజేపీనే కేసీఆర్ తనకు ప్రత్యామ్నాయం అనుకుంటున్నాడు. రాజకీయాలంటే డబ్బులతో కొనడం అనుకుంటున్నారని షర్మిల పేర్కొన్నారు.