గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త తెలిపారు. పదివేలమందికి గృహ లక్ష్మీ ఇళ్లు మంజూరు చేశారు. అయితే మరో రెండు రోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఇదిలా ఉండగా.. గజ్వేల్ నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన వంద పడకల మాతా మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అలాగే గజ్వే్ల్‌లో ఒక్కరోజులోనే 530 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని హరీష్ రావు అన్నారు.
గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త తెలిపారు. పదివేలమందికి గృహ లక్ష్మీ ఇళ్లు మంజూరు చేశారు. అయితే మరో రెండు రోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఇదిలా ఉండగా.. గజ్వేల్ నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన వంద పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అలాగే గజ్వే్ల్‌లో ఒక్కరోజులోనే 530 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని హరీష్ రావు అన్నారు. 300 కోట్ల రూపాయలతో నిర్మించికున్న ఔటర్ రింగ్ రోడ్డుని.. అలాగే 150 కోట్ల రూపాయలతో గజ్వే్ల్ మున్సిపాలిటీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించున్నామని పేర్కొన్నారు. అయితే 36 కోట్ల రూపాయలతో నిర్మించుకున్న మాతా శిశు ఆసుపత్రి ద్వారా గర్భిణీలకు, చిన్నపిల్లలకు మెరుగైన వైద్యంఅందుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు కాబట్టే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వ్యాఖ్యానించారు.
గతంలో గజ్వేల్ ప్రాంతంలో తమ కూతుర్లను నీళ్లు మోపిస్తారేమోనని తల్లిదండ్రులు భయపడేవారని.. కానీ ఈరోజు పొయ్యి దగ్గరకు మంచినీళ్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. అలాగే దేశంలో గజ్వేల్ ఆదర్శ నియోజకవర్గంగా నిలిచిందని.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అధ్యయనం చేసే స్థాయికి గజ్వేల్ చేరిందని వ్యాఖ్యానించారు. అలాగే గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పన హామీలన్ని ముఖ్యమంత్రి నెరవేర్చారని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై కూడా మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటే ఒక నాటకం అని.. నాటాకాలు ఆడే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మోసపోతామని అన్నారు.పీసీసీ అంటే పేమెంట్ కలెక్షన్ సెంటర్ అంటూ ఎద్దేవా చేశారు. అలాగే కాంగ్రెస్ అంటే ఒక కమిషన్ అని.. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఆ పార్టీలో ఉందంటూ విమర్శించారు.
మరోవైపు సాగునీరు లేని గజ్వేల్ ప్రాంతానికి తాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కృషి వల్లే గజ్వేల్ ప్రాంతానికి రైలు రావడం సాధ్యమైందని అన్నారు. తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలన్న, మరింత అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థల జాబితాను ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా త్వరలోనే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించునున్నాయి. అలాగే రాష్ట్రానికి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం బృందం చేరుకుంది. మూడురోజుల పాటు వీరు రాష్ట్రంలోపర్యటించనున్నారు. అలాగే రాజకీయ నేతలతో కూడా సమావేశం కానున్నారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.