
భారీగా హాజరైన తెలుగు తమ్ముళ్లు.
రోగులకు పండ్లు,స్వీట్లు పంపిణీ.
వేపాడ,మార్చి,29(ఆంధ్ర పత్రిక ):- మండల కేంద్రం వేపాడలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి ఆదేశాల మేరకు తెదేపా మండల పార్టీ ఉపాధ్యక్షుడు పోతల రమణ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం పార్టీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారకరామారావు విగ్రహానికి పాలాభిషేకం చేయడంతో పాటు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షురాలు మరియు మాజీ ఎంపీపీ దాసరి లక్ష్మి మాట్లాడుతూ పార్టీ వైభవానికి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పార్టీ జెండా రెపరెపలాడించాలని కార్యకర్తలు ఆ దిశగా నడుం బిగించి పనిచేయాలని పిలుపునిచ్చారు.అన్న ఎన్టీఆర్ అమర్ రహే,చంద్రబాబు జిందాబాద్,కోళ్ల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ భారీ స్థాయిలో నినాదించారు. అలాగే వల్లం సెంటర్ కు బైకులపై ర్యాలీగా చేరుకొని అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న దేశం పార్టీ కార్యకర్తలంతా రోగులకు పండ్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భోజంకి మహేష్, మాజీ ఉప సర్పంచ్ గుంటపల్లి దేముడు నాయుడు,మాజీ ఎంపీటీసీ వేచలపు జగ్గు బాబు,వేచలపు రామకృష్ణ,గోకాడ నాగభూషణం,నిరుజోగి ముత్యాల నాయుడు,గోకాడ సత్యం,కోలా అప్పల సత్యనారాయణ,కోన సత్యనారాయణ,జొన్నపల్లి వెంకటరమణ,నిరుజోగి అమ్మతల్లి నాయుడు,మాజీ ఎంపీటీసీ నిరుజోగి ఈశ్వరమ్మ, రావాడ రాము,మేడపురెడ్డి వెంకటరమణ,నాగిరెడ్డి ముత్యాల నాయుడు,భూసరి కృష్ణ కుమార్,గొర్రెపోటి రాము, యువ నాయకుడు గొర్రెపోటు ప్రసాద్,చల్లా వెంకట్రావు,జామి అప్పలనాయుడు,మాజీ సర్పంచ్ గొలగాని కృష్ణమూర్తి, మండలంలోని రేప నాయకులు కార్యకర్తలు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు,తెలుగు యువత అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.