1947 ఆగస్టు 15 నుండి మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు అనేక మంది సమర యోధులు, మహనీయులు మరియు ప్రజలు 1857 నుండి బ్రిటీష్ పాలనపై జరిపిన సుదీర్ఘ పోరాటాలు మరియు త్యాగాల ఫలితమే.
ఆ మహోద్యమంలో అనేక పోరాటాలు మరియు త్యాగాలు చేసి అసువులు బాసిన వీరులను స్మరించుకొని, వారికి నివాళులు అర్పించి, ఏల్లవేళలా మన దేశాన్ని కాపాడుచున్న సైనికులకు మనం కృతఘ్నతలు తెలపాలని కోరుచున్నాను.
ఇళ్ళపై జాతీయ పతాకాలను ఎగురవేసి, దేశ సర్వతోముఖాభివృద్ధికి, ఔన్నత్యతకు మరియు సమగ్రతకు ఎల్లప్పుడు పాటుపడతామని ప్రతినబూనుచూ నేడు స్వేత్యా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుచూ ప్రకాశం జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను.