నవంబర్ 07 (ఆంధ్రపత్రిక): ’అ!’, ’కల్కి’, ’జాంబిరెడ్డి’ వంటి వినూత్న సినిమాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు ప్రశాంత్ వర్మ. ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు సంపాదించు కున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ హీరో ఫాంటసీ నేపథ్యంలో ’హనుమాన్’ అనే పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నాడు. తేజా సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించింది. ఈ సినిమా టీజర్ డేట్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా ప్రకటించాడు. హనుమాన్ టీజర్‌ను నవంబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో తేజ సజ్జా శంఖం పూరిస్తున్నట్లు ఉన్నాడు. అయితే ఈ సినిమా టీజర్‌ను ముందుగా దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అదే రోజున ఆదిపురుష్ టీజర్ రావడంతో పోస్ట్ పోన్ చేశారు. సూపర్ హీరో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. డాక్టర్ ఫేం వినయ్‌రాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!