జనవరి 10 (ఆంధ్రపత్రిక): తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ హీరో మూవీ ’హనుమాన్’. అమృత అయ్యర్ హీరోయిన్. కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్న మేకర్స్, ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం మూవీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. భారతీయ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కు తున్న ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. ’ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో హనుమాన్’ అంటూ మనదేశంతో పాటు అమెరికా, చైనా, జపాన్, యు.కె, స్పెయిన్, ఆస్టేల్రియా, జర్మనీ, శ్రీలంక, మలేషియా దేశాల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ భాషల్లో సినిమా రిలీజ్ కానుందని అనౌన్స్ చేశారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!