డిసెంబర్ 24 (ఆంధ్రపత్రిక): హీరోయిన్ హన్సిక ’గాంధారి’గా వెండితెరపై కనిపించనుంది. ఆర్.కణ్ణన్ దర్శకత్వంలో రూపొందే ఈ లేడీ ఓరియంటెండ్ చిత్రంలో ఆమె తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తోంది. ఎమోషనల్, హారర్ బేస్డ్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనట్లుగా తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఇందులో హన్సికతో పాటు మెట్రో శిరీష్, మయిల్‌స్వామి, తలైవాసల్ విజయ్, నరేన్, పవన్ తదితర నటీనటులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మసాలా పిక్స్ బ్యానరుపై ఆర్.కణ్ణన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంగీతం ఎస్.వి.ముత్తుగణెళిశ్. కాగా, వైవిధ్యభరితమైన కథా చిత్రాలను రూపొందించే ఆర్.కణ్ణన్ తాజాగా ’గ్రేట్ ఇండియన్ కిచెన్’, ’కాసేదాన్ కడవులడా’ వంటి చిత్రాలను రూపొందించగా, ఈ రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు రీసెంట్‌గానే హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 4న తన ప్రియుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాని వివాహమాడిరది. పెళ్లి తర్వాత కూడా నటించడానికి ఆమె ఇంట్రస్ట్ చూపిస్తుందనేదానికి ఉదాహరణగా.. ఈ ’గాంధారి’తో ఆమె డబుల్ ధమాకా ఇవ్వబోతుంది. త్వరలోనే ’గాంధారి’కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయ నున్నామని దర్శకుడు ఆర్. కణ్ణన్ వెల్లడిరచారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!