– తల్లిదండ్రుల రెక్కల కష్టం…తమ కుటుంబ తలరాతనే మార్చిన కొడుకు
– తండ్రి ఆశయాలే స్ఫూర్తిగా…
తూర్పుగోదావరి జిల్లా,ఆరికరేవుల, : బిక్కవోలు మండల పరిధిలోని ఆరికరేవుల గ్రామానికి చెందిన గురు శ్రీనివాసు తనయుడు గురు ధరహస్ అనే యువకుడు ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ లో వ్రాసిన జాబ్ ఎగ్జామ్ లో తొలి ప్రయత్నంలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ జాబ్ సాధించాడు. తల్లిదండ్రులు బంధువులతో పాటు మండల, గ్రామ ప్రజలు తనని అభినందించారు. బిక్కవోలు మండలం, ఆరికరేవుల గ్రామం ప్రాథమిక విద్యను అభ్యసించి ఉన్నత విద్యకై 2017లో జరిగిన ఎంసెట్ లో 2283 ర్యాంక్ రావడంతో బాపట్ల అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీలో డిగ్రీ సాధించి 2022-23లో జరిగిన ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ రావడంతో సంవత్సరం పాటు ఇంటివద్దనే కావలసిన నోట్స్ ప్రిపేర్ అయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే బ్యాంక్ ఆఫీసర్ గా జాబ్ పొందడం హర్షణీయమన్నారు. కష్టపడితే సాధించలేనిదేదీ లేదనడానికి నిదర్శనం గురు ధరహస్ బ్యాంక్ ఉద్యోగం సాధించిన ఆ యువకుడు, తన తండ్రినే స్ఫూర్తిగా తీసుకొని..ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే యూట్యూబ్ క్లాస్లు విని పరీక్షలు రాశాడు. దాని ఫలితంగా ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ లో వ్రాసిన జాబ్ ఎగ్జామ్ లో తొలి ప్రయత్నంలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ జాబ్ సాధించాడు. అలా కష్టపడి చదివి బ్యాంక్ ఉద్యోగానికి ఎంపికై నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. జాబ్ ఎంపిక పట్ల స్నేహితులు, బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.