తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. జగదీశన్ సూపర్ క్యాచ్
5వ ఓవర్ రెండో బంతికి గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో జగదీశన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సాహా 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.12 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 101/2. సాయి సుదర్శన్ (31), అభినవ్ మనోహర్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న గిల్, సుదర్శన్
సాహా వికెట్ పడ్డాక కూడా గిల్ (27), సుదర్శన్ నిలకడగా ఆడుతున్నారు. 8 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/1గా ఉంది. ఈ మ్యాచ్‌లో గిల్ ఐపీఎల్లో 2000 పరుగుల మైలురాయిని దాటాడు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. జగదీశన్ సూపర్ క్యాచ్
5వ ఓవర్ రెండో బంతికి గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో జగదీశన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సాహా 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 38/1. గిల్ (10), సాయి సుదర్శన్ (4) క్రీజ్‌లో ఉన్నారు.
అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్వల్ప అస్వస్థత కారణంగా ఇవాల్టి మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా దూరం కాగా అతని స్థానంలో రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హార్ధిక్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. టిమ్ సౌథీ స్థానంలో ఫెర్గూసన్, మన్దీప్ సింగ్ ప్లేస్‌లో జగదీశన్ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు..
గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ షమీ, అల్జరీ జోసఫ్, యశ్ దయాల్
కోల్‌కతా నైట్‌రైడర్స్: రహ్మానుల్లా గుర్భాజ్ (వికెట్‌కీపర్), ఎన్ జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, సుయాశ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి