న్యూఢల్లీి,డిసెంబర్17 (ఆంధ్రపత్రిక): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన శనివారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేక పోయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆన్లైన్ గేమింగ్‌పై జీఎస్టీ సహా పలు అంశాలే ఎజెండాగా ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసిందనే చెప్పాలి. ఇందులో కేవలం 15 అంశాలపైనే చర్చించారు. సమయాభావం కారణంగా మరికొన్ని అంశాలపై చర్చించలేదని అధికారులు వెల్లడిరచారు. వీడియో కార్ఫరెన్స్ ద్వారా శనివారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పలు విజ్ఞప్తులు చేశారు. మైనర్ ఇరిగేషన్, కస్టమ్ మిల్లింగ్, బీడీ ఆకులపై జీఎస్టీ మినహాయింపును కోరారు. ఈ సమావేశం అనంతరం ఉన్నతాధికారులతో కలిసి మంత్రి నిర్మలా సీతారామన్ విూడియాతో మాట్లాడారు. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమర్పించిన సిఫార్సును ఈ సమావేశంలో చర్చంచలేదు. ఈ సమావేశానికి రెండు రోజుల ముందు నివేదిక సమర్పించడం వల్ల దీనిపై చర్చ జరగలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ఈ గేమింగ్స్‌పై జీఎస్టీ విధింపు అంశం వాయిదా పడిరది. అయితే ఆన్లైన్ క్రీడలపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం తన నివేదికలో సిఫార్సు చేసింది. అయితే ఈ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని అందరు భావించినా.. చివరికు ఎలాంటి చర్చ జరగలేదు. పప్పుల పొట్టుపై జీఎస్టీ తగ్గింపును ప్రకటించారు. పొట్టుపై పన్ను ఐదు శాతం నుంచి జీరో శాతంకు తగ్గింది. అలాగే ఇథనాల్‌పై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇథనాల్‌పై 18 నుంచి 5 శాతానికి జీఎస్టీని తగ్గించారు. ఇక జీఎస్టీని ఎగ్గొట్టే సంస్థలకు భారీగా జరిమానా విధించాలని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక అలాగే కొన్ని నేరాలను డీ క్రిమినలైజ్ చేస్తూ నిర్ణయం తీసుకుట్లు రెవెన్యూశాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. అలాగే ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు కావాల్సిన పరిమితిని ప్రస్తుతం కోటి రూపాయల నుంచి రెట్టింపు చేసి రెండు కోట్లకు పెంచినట్లు తెలిపారు. అలాగే కొత్త ట్యాక్స్‌లకు సంబంధించి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. సమయాభావం కారణంగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అజెండాలోని 15 అంశాల్లో ఎనిమిదింటిపై మాత్రమే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. జీఎస్టిపై అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను రూపొందించడమే కాకుండా, పాన్ మసాలా, గుట్కా వ్యాపారాలలో పన్ను ఎగవేతను నిరోధించే వ్యవస్థను రూపొందించడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!