పరిశ్రమలు పెట్టే వారికి త్వరగా అనుమతలు
- తూర్పులో బయో ఇథనాల్ ప్లాంట్‌కు సిఎం జగన్ శంకుస్థాపన
- రూ.270 కోట్లతో టెక్ మహీంద్రా గ్రూప్ ఇథనాల్‌ను ప్లాంట్‌ను ఏర్పాటు
- పరిశ్రమలు నెలకొల్పేందుకు తొలి అడుగు
- 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్లాంట్ రాబోతుంది
- స్థానికులకు ఉపాధి అవకాశాలు
- ఏపీకి ఇథనాల్ ప్లాంట్ రావడం చాలా సంతోషం
- ఈ ప్లాంట్ వలన రైతులు, స్థానిక యువతకు ఎంతో ఉపయోగం
గోకవరం,నవంబర్4(ఆంధ్రపత్రిక):రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి పెద్దపీట వేస్తున్నామని సిఎం జగన్ అన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ… రూ.270 కోట్లతో టెక్ మహీంద్రా గ్రూప్ ఇథనాల్‌ను ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు తొలి అడుగు పడిరదన్నారు.2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్లాంట్ రాబోతుందని, దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. బ్రోకెన్ రైస్‌తో ప్లాంట్‌లో ఇథనాల్ తయారీ చేస్తారని, ప్లాంట్‌తో పాటు బైప్రోడక్ట్ కింద పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రోటీన్ ఫీడ్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025`26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు పెద్దపీట వేశామని జగన్ అన్నారు. ఏపీకి ఇథనాల్ ప్లాంట్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్లాంట్ వలన రైతులు, స్థానిక యువతకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి దగ్గర 270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశారు. రాజమండ్రి సవిూపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించు కోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించా లన్న లక్ష్యంగా 2025?26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుంది. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్‌ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. అస్సాగోతో పాటు క్రిభ్కో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎకో స్టీల్, సెంటిని, డాల్వకో ట్, ఈఐడీ ప్యారీ వంటి సంస్థలు కలిపి సుమారు రూ.2,017 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. హరిత ఇంధనానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా బయో ఇథనాల్ పాలసీని రూపొందిస్తోంది. దీని ద్వారా బయో ఇథనాల్ తయారీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావం ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రు లు అమర్నాథ్, వేణుగోపాల కృష్ణ, ఎంపిలు భరత్, వంగా గీత తదితరులు పాల్గొన్నారు.