న్యూఢల్లీి,అక్టోబర్31 (ఆంధ్రపత్రిక): భారత జాతి ఐక్యతకు కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఢల్లీిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా పటేల్ చౌక్ లోని ఆయన చిత్ర పటానికి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ఏక్తా దివాస్ గా నిర్వహిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఢల్లీి లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, మంత్రి విూనాక్షి లేఖి పాల్గొన్నారు. ఇదిలావుంటే గుజరాత్లో సర్థార్ వల్లభాయి పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏక్తానగర్లో రాష్టీయ్ర ఏక్తా దివస్ సందర్భంగా సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. నర్మదా నదిలోని సర్థార్ వల్లభాయి పటేల్ విగ్రహం పాదా లకు మోడీ పాలాభిషేకం నిర్వహించారు. ఏక్తా దివస్ వేడుకల్లో త్రివిధ దళాల పరేడ్ ఆకట్టుకుంది. భారత ఉక్కు మనిషి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ.. స్టాచ్యు ఆఫ్ యూనిటీ వద్ద మరో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎదురుగా జంగిల్ సఫారీకి సవిూపంలో ఏర్పాటు చేసిన మియావాకి ఫారెస్ట్ గార్డెన్, భుల్భులయ్య పార్క్ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రజలకు అంకితం చేశారు
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!