పూలమాలలుతో నివాళులర్పించిన డిసిసిబి చైర్మన్.
వేపాడ,ఏప్రిల్,5(ఆంధ్ర పత్రిక): – స్వాతంత్ర్య సమరయోధుడు,దళిత జన బాంధవుడు, సంఘసంస్కర్త,బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను బుధవారం మండలంలోని నీలకంఠ రాజపురం వైభవంగా జరిపారు. ముందుగా గ్రామంలోని బాబు జగజీవన్ రాం విగ్రహానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ వేచలపు వెంకట చినరామనాయుడు చేతుల మీదుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ రాష్ట్రం జోధ్పూర్ జిల్లా చందువా గ్రామంలో 1908లో జన్మించిన ఆయన కలకత్తా యూనివర్సిటీలో బీఎస్సీ చదివిన ఆయన భారతదేశ స్వతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా ఎన్నో ఉన్నత పదవులను అలంకరించి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పాటుపడిన ఆయన భారతదేశ మాజీ ఉప ప్రధానిగా దేశ చరిత్రలో నిలిచారని డిసిసిబి చైర్మన్ వి.వి.చిన రాము నాయుడు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మూకల కస్తూరి,గ్రామ సర్పంచ్ గొటివాడ దేవి,ఉప సర్పంచ్ కండిపల్లి పెదనాయుడు,చిన గుడిపాల సర్పంచ్ బోజంకి రామునాయుడు, జి.లక్ష్మణరావు,అప్పారావు,ఈశ్వర రావు, మరియదాసు,అప్పయ్య,తదితరులు పాల్గొన్నారు. ఫోటో 1: – తెలియజేస్తున్న డిసిసిబి చైర్మన్ దృశ్యం.