
గవర్నర్‌కు గత్యంతరం లేదు: కేటీఆర్
ANDHRAPATRIKA , హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తిప్పిపంపిన మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యాశాఖలకు సంబంధించిన మూడు బిల్లులను మళ్లీ రాష్ట్ర శాసనసభలో ఆమోదించి..
రాజ్‌భవన్‌కు పంపాలని కేబినెట్ నిర్ణయించిందని కేటీఆర్ తెలిపారు. శాసనసభ రెండోసారి పాస్ చేసిన బిల్లుల విషయంలో గవర్నర్‌కు మరో గత్యంతరం ఉండదని.. రాజకీయంగా ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నా రాజ్యాంగం ప్రకారం ఆమోదించక తప్పదని పేర్కొన్నారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయమని స్పష్టం చేశారు. గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.