రెడ్డి సామాజిక వర్గానికే మేలుచెయ్యలేని వైసీపీ ప్రభుత్వం ఇక మిగిలిన వర్గాలకు ఏమి మేలుచేస్తుందో ప్రజలు గుర్తించాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. మండలకేంద్రమైన సిద్దవటంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాకు చెందిన దాదాపు 176 మంది కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వములో ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు 176 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 46 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందన్నారు. దీన్ని బట్టి చూస్తే రైతులపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఎంతో తెలుస్తుందన్నారు. భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ చెయ్యని విధంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన 5 కోట్ల సొంత నిధులతో ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంటే సభకు హాజరవకుండా కౌలు రైతులను బెదిరించడం, అడ్డుకోవడం సబబుగా లేదన్నారు. ఇప్పటివరకు 5 జిల్లాల్లో 607 మంది కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. జనసేన పార్టీ పరంగా రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించి భరోసా కల్పించడంతో పాటుగా వారి పిల్లల ఉన్నత చదువులకు జనసేన కార్యకర్తలు కృషి చేస్తారన్నారు. తాను మార్పు కోసం జనసేన పార్టీని స్థాపించానని కులం కోసం పార్టీని స్థాపించలేదని స్పష్టం చేశారు. కులం కన్నా గుణం గొప్పది అన్న గుణం ప్రధానమన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. పేదరికానికి కులం పేదరికం లేదన్నారు. రాయలసీమలో దాదాపు 60 వేల మంది కౌలు రైతులు ఉంటే 2 వేల 230 మందికే కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారని విమర్శించారు. వైసీపీ పార్టీలో ఆయన సొంత కులం వారి దెబ్బతిన్నారని అందుకు ఉదాహరణగా అనంతపురం జిల్లా నుంచి జెసి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డిలు, కౌలు రైతులు చనిపోతే పట్టించుకోలేదని, వ్యక్తిగత ఆధిపత్యం కోసం సొంత చిన్నాన్న చనిపోయిన ఇంతవరకు క్రిమినల్స్ ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. భయపడి ఎంతకాలం పారిపోతారని ఎదురు తిరిగి నిలబడిన వారికి తాను అండగా ఉంటానని భరోసాని ఇచ్చారు. పార్టీని పెట్టలేదని రాజకీయాల మార్పు కోసం దెబ్బతి వైసిపిని దెబ్బతీయడానికే రావడం జరిగిందన్నారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సొంత కుమారుల చూసుకుంటున్నారు అన్న నా మాటలపై ఆయన స్పందిస్తూ కేంద్ర సహకారం ఉంటే పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు స్థాపించలేదని సూటిగా ప్రశ్నించారు. సమాజం మారాలని ఎంతమంది ముఖ్యమంత్రి రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన రాయలసీమ అభివృద్ధి ఏమాత్రం జరగలేదని ఆయన విమర్శించారు ఒక్కసారి జనసేనకు అవకాశం ఇస్తే రాజకీయ రాయలసీమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సిద్ధవటానికి చెందిన సీనియర్ నాయకులు అతికారి వెంకటయ్య, అతికారి దినేష్, అతికారి క్రిష్ణలు కండువా వేసి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్సులు ముఖర్రం చాన్, తాతంశెట్టి నాగేంద్ర, రాయచోటి, మైదుకూరు, అసెంబ్లీ ఇంచార్జిలు హసన్ బాషా, పండిట్ మల్హోత్రా, అనంతపురం జిల్లా జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, చక్రవర్తి, నానాజీ, పివిఎస్ మూర్తి, అమలాపురం ఇంచార్జి రాజాబాబు, కార్యక్రమ నిర్వాహకులు కేకే, తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!