IPL 2023- PBKS- Liam Livingstone: పంజాబ్ కింగ్స్‌కు శుభవార్త. పవర్ హిట్టర్, ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ త్వరలోనే జట్టుతో చేరనున్నాడు.ఈ విషయాన్ని లివింగ్‌స్టోన్ స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ” గత రెండు నెలలుగా కఠిన పరిస్థితులు.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతా.. త్వరలోనే మీతో చేరతా పంజాబ్ కింగ్స్” అని సోమవారం ట్వీట్ చేశాడు.కాగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పంజాబ్ కింగ్స్ లివింగ్‌స్టోన్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి ఆటకు దూరమైన అతడు ఇన్నాళ్లు చికిత్స తీసుకున్నాడు.
లియామ్ లివింగ్‌స్టోన్ (PC: IPL)
ఇంజక్షన్లు తీసుకున్నా
ఈ క్రమంలో కోలుకున్న లివింగ్‌స్టోన్ లంకాషైర్ క్రికెట్ టీవీ ఇంటర్వ్యూలో ఆదివారం మాట్లాడుతూ.. ”గత వారం ఇంజక్షన్లు తీసుకున్నా. అవి అద్భుతమైన ప్రభావం చూపాయి. రానున్న 48 గంటల్లో ఇండియాకు పయనమవుతా” అని పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా మరోసారి అప్డేట్ ఇచ్చాడు. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పవర్ హిట్టర్ వస్తే తమ బ్యాటింగ్ ఆర్డర్ బలం పెరుగుతుందని పేర్కొంటున్నారు. కాగా ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా లివింగ్‌స్టోన్ సొంతమని ఇప్పటికే పలుమార్లు రుజువైన విషయం తెలిసిందే.
పవర్ హిట్టర్ వచ్చేస్తున్నాడు..
ఇక 29 ఏళ్ల లివింగ్‌స్టోన్ 2017లో సౌతాఫ్రికాతో టీ20మ్యాచ్‌తో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2021లో వన్డే, 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఒక టెస్టులో 16 పరుగులు, 12 వన్డేల్లో 250 పరుగులు, 20 టీ20లలో 423 పరుగులు సాధించాడు.
ఇదిలా ఉంటే.. తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ప్రస్తుతం ధావన్ సేన పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. పంజాబ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 13న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అన్నీ కుదిరితే ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ ఆడే అవకాశం ఉంది.