భద్రా చలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గు తున్నది. గురువారం ఉదయం 53.3 అడు గులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 12 గంట లకు 53 అడుగులకు తగ్గింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో బుధవారం భద్రాచలం వద్ద 54.5 అడుగులకు చేరింది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. అయితే వరద కాస్త తగ్గినప్పటికీ ఇప్పటికీ ప్రమాద స్థాయిని మించే ప్రవహిస్తున్నది. గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలంలో లోతట్టు ప్రాంతాలు మరోసారి జలదిగ్భం ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. పైనుంచి భారీ వరద వస్తుండటంతో నెల రోజుల వ్యవధిలో అధికారులు మూడుసార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయడం విశేషం. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా, గోదావరిల్లోకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. అయితే బుధవారం కంటే గోదావరి వద్ద నీటిమట్టం స్వల్పంగా తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 53 అడుగుల వద్ద ప్రవహిస్తోందని చెప్పారు. మరోవైపు జూరాలకు మాత్రం వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోందని అన్నారు. భద్రాచలం వద్ద ఉద్ధృతంగా పెరిగి 54 అడుగులు దాటి ప్రవహించిన నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 53.3 అడుగుల వద్ద ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. గతంలో కంటే నీటిమట్టం పెరగడంతో.. భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రహదారులపైకి వరద నీరు చేరడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజులుగా ముంపు మండలాలు జలదిగ్బంధంలోనే చిక్కుకొనే ఉన్నాయి. కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యవసరాలు లభించక సుమారు 200 పైగా గ్రామాలప్రజలు ఇబ్బందిపడుతున్నారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా పరివాహక ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. జూరాల జూరాల ప్రాజెక్టు ఇన్‌ప్లో 2.35 లక్షల క్యూసెక్కులు ఉండగా 2.40 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 318.516 విూటర్లు కాగా ప్రస్తుతం 317.690గా ఉందని అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. సాగర్‌లోకి లక్ష 17 క్యూసెక్కులు వస్తుండంగా అంతేమొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు .సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుత 584.80 అడుగులు ఉందని అధికారులు తెలిపారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!