రోమ్,అక్టోబర్ 22 (ఆంధ్రపత్రిక): ఇటలీ తొలి మహిళా ప్రధాన మంత్రిగా జార్జియా మెలోని(45) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. 24 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసింది.బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత మెలోని ఇటీవల జరిగిన ఎన్నికల్లో 26.37 శాతం ఓట్లు సాధించారు. ఫోర్జా ఇటాలియా, లీగ్ పార్టీలతో కూడిన ఆమె నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించింది. దీంతో.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో పూర్తి అతివాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయింది.ఇక్కడి అధ్యక్ష భవనంలో దేశాధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా సమక్షంలో మెలోని ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు.. సుదీర్ఘ చర్చల అనంతరం శుక్రవారం మెలోని తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. సొంత పార్టీకి తొమ్మిది క్యాబినెట్ పదవులు.. లీగ్, ఫోర్జా ఇటాలియాలకు ఐదు చొప్పున శాఖలు కేటాయించారు. ఈ క్యాబినెట్లో మొత్తం ఆరుగురు మహిళలు ఉన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఆర్థిక మాంద్యం, పెరుగుతోన్న ఇంధన బిల్లుల వంటి సవాళ్ల నడుమ ఈ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.వివాదాస్పదమైన ‘గాడ్, ఫాదర్ల్యాండ్ అండ్ ఫ్యామిలీ’ నినాదంతో మెలోని ఎన్నికల్లో ముందుకు సాగారు. ఆమె ఎల్జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌ను విమర్శించేందుకూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తానని ఆమె హామీ ఇచ్చారు. మరోవైపు.. అధికార కూటమిలోని ఫోర్జా ఇటాలియా అధినేత బెర్లుస్కోనీ మాత్రం.. రష్యా సైనిక చర్యకు ఉక్రెయినే కారణమని ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!