న్యూఢల్లీి,అక్టోబర్3 (ఆంధ్రపత్రిక): స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ ప్రైజ్ కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అంతరించిన మానవ జాతుల విశ్వ జన్యురాశి, మానవ పరిణామానికి సంబంధించి ఆయన చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయను న్నారు. వైద్య రంగంలో నోబెల్ బహుమతిని అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా భావిస్తారు. స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన నోబెల్ అసెంబ్లీ ఈ అవార్డు విజేతను ఎంపిక చేస్తుంది. ఏటా డిసెంబర్ 10న నోబెల్ బహుమతుల ప్రదానం జరుగుతుంది. ఈ అవార్డు కింద 10 మిలియన్ స్వీడిష్ క్రోన్లు (భారత కరెన్సీలో 7.20 కోట్లు) ఇవ్వనున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి నోబెల్ బహుమతుల ప్రదానం జరగలేదు. ఇవాళ వైద్య రంగానికి సంబంధించి నోబెల్ బహుమతి విజేతను ప్రకటించిన కమిటీ రేపు ఫిజిక్స్, 5వ తేదీన కెమిస్టీ, 6న లిటరేచర్, 7న నోబెల్ శాంతి బహుమతి, 10న ఎకనామిక్స్ విజేతలను ప్రకటించనుంది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!