సైబర్ మోసాలు ఈ మద్య కాలంలో షరా మామూలు అయిపోయింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ అన్న తేడా లేకుండా అన్ని రకాలుగా మోసం చేసేది ఒక్క సైబర్ నేరగల్లే. ఉన్న డబ్బు పోయే వరకు ఎలా మోసపోయామో కూడా తెలియదు. ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్న ఇక అంతే సంగతులు. జేబులు గుల్ల కావాల్సిందే. వందల్లో సంపాదించే వారి మొదలు కోట్లు కూడబెట్టే వాళ్ల వరకు ఈ మధ్య సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకోక తప్పటం లేదు. ఇక తాజాగా విజయవాడలో ఇలాంటి సంఘటన చోటు చేసుంకుంది.
సైబర్ మోసాలు ఈ మద్య కాలంలో షరా మామూలు అయిపోయింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ అన్న తేడా లేకుండా అన్ని రకాలుగా మోసం చేసేది ఒక్క సైబర్ నేరగల్లే. ఉన్న డబ్బు పోయే వరకు ఎలా మోసపోయామో కూడా తెలియదు. ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్న ఇక అంతే సంగతులు. జేబులు గుల్ల కావాల్సిందే. వందల్లో సంపాదించే వారి మొదలు కోట్లు కూడబెట్టే వాళ్ల వరకు ఈ మధ్య సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకోక తప్పటం లేదు. ఇక తాజాగా విజయవాడలో ఇలాంటి సంఘటన చోటు చేసుంకుంది. ఏకంగా ఒక గెజిటెడ్ స్థాయి ఆఫీసర్ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఏకంగా ఐదు లక్షలు పోగొట్టుకుని లబోదిబోమన్నాడు. ఈ ఘటనపై పోలీసులని ఆశ్రయించాడు.
సింపుల్‌గా మీకో విలువైన కొరియర్ వచ్చిందంటూ కాల్ చేసిన ఆ సైబర్ నేరగాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్ నుండి ఏకంగా ఐదు లక్షలు లాగేసారు. మొదట విలువైన కొరియర్ అంటు కాల్ చేశారు, తర్వాత కొంత డబ్బు పంపితే మీ అడ్రెస్స్కు పంపుతాం అన్నారు. ముంబైలోని ఫెడెక్స్ కొరియర్ సర్వీస్ నుండి కాల్ చేస్తున్నాం అంటు నమ్మబలికారు. ఆ అధికారి పేరు చెప్పి పాలన వ్యక్తి నుండి మీకు కొరియర్ వచ్చిందంటూ పరిచయం పెంచుకున్నారు. ఆ కొరియర్లో డాలర్స్, పాస్ పోర్ట్‌లు, బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు ఉన్నాయని వాటి గురించి ముంబై సైబర్ క్రైమ్ పోలీసులతో మట్లాడాలంటు మారో అపరిచిత వ్యక్తికి ఫోన్ కలిపారు.
అతనితో మాట్లాడిన గెజిటెడ్ ఆఫీసర్‌కు కొరియర్ లో ఉన్న డాలర్ల విలువలో సగం డబ్బులు కడితే కొరియర్ పంపిస్తాం అని చెప్పాడు. ఆ అపరిచిత వ్యక్తి దాంతో విజయవాడకి చెందిన ఆ గెజిటెడ్ ఆఫీసర్ తన అకౌంట్ నుండి 5 లక్షలు చెల్లించాడు. ఇక అంతే సంగతి..ఎక్కడి ఫోన్లు అక్కడ స్విచ్ ఆఫ్. కొరియర్ లేదు ఏమీ లేదు. ఉన్న డబ్బులు కూడా పోయాయి. దాంతో చేసేది లేక పోలీసులని ఆశ్రయించాడు ఉద్యోగి. దీనిపై కేస్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కల్స్ గిఫ్ట్స్‌ను నమ్మొదంటు హెచ్చరిస్తున్నారు.