2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది, ఆ తర్వాత గంభీర్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. రాహుల్ ద్రవిడ్ శిక్షణలో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మహంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ జట్టు సహాయక సిబ్బందిలో ఉన్నారు.
టీమ్ ఇండియా కొత్త కోచ్ ఎవరన్న ప్రశ్నకు సమాధానం అతి త్వరలో వెల్లడికానుంది. కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపిక కావడం ఖాయమని సమాచారం. ఆయన నియమాకానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఈ నెలాఖరులోగా గంభీర్ పేరును కూడా అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. అయితే టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా ప్రయాణం ఆధారంగా గంభీర్ నియామకం ఉంటుంది. జూన్ 28 వరకు జరిగే ఈ టోర్నీలో టీమిండియా ప్రయాణం ముగిసిన వెంటనే కొత్త ప్రధాన కోచ్‌ని ప్రకటించే అవకాశం ఉంది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది, ఆ తర్వాత గంభీర్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. రాహుల్ ద్రవిడ్ శిక్షణలో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మహంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ జట్టు సహాయక సిబ్బందిలో ఉన్నారు.ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఈ ముగ్గురిని తన కోచింగ్ స్టాఫ్‌లో ఉంచుకోవచ్చు లేదా అతనికి కావాలంటే వారిని తొలగించవచ్చు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ రవిశాస్త్రి రోజుల నుండి టీమ్ ఇండియాతో అనుబంధం కలిగి ఉన్నాడు. కానీ పరాస్ మహంబ్రే, టి. దిలీప్, ద్రవిడ్ తో పాటు ఎంపికయ్యారు.
గంభీర్ ఇప్పటివరకు ఏ జట్టుకు పూర్తిస్థాయి కోచ్‌గా వ్యవహరించలేదు. అయితే గత మూడేళ్లుగా ఐపీఎల్లో మెంటార్‌గా పనిచేశాడు. 2022 నుండి 2023 వరకు లక్నో సూపర్‌జెయింట్స్‌లో ఉన్న గంభీర్, జట్టును బ్యాక్-టు-బ్యాక్ ప్లే ఆఫ్స్ రౌండ్ వరకు తీసుకెళ్లాడు. ఇక IPL 2024 ప్రారంభానికి ముందు KKR జట్టులో చేరాడు గంభీర్ . అతని మార్గదర్శకత్వంలో, KKR జట్టు మూడోసారి IPL ఛాంపియన్‌గా అవతరించింది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇది జరిగిన తర్వాత, జట్టు ఆటగాళ్ల నుండి సహాయక సిబ్బందికి అనేక మార్పులు చూడవచ్చు.