LPG Price Hikes: గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి చమురు కంపెనీలు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ధరను పెంచుతున్నట్లు ప్రకటించాయి. గ్యాస్ సిలిండర్‌పై రూ. 209 పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అంటే.. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయియ. పెంచిన ధరలతో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం..
గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి చమురు కంపెనీలు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ధరను పెంచుతున్నట్లు ప్రకటించాయి. గ్యాస్ సిలిండర్‌పై రూ. 209 పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అంటే.. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయియ. పెంచిన ధరలతో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1,731.50 అవుతుంది. కాగా, వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై సెప్టెంబర్ నెలలో గణనీయంగా రూ. 158 తగ్గించాయి. అంతకు ముందు ఆగస్టు నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలను రూ. 99.75కి తగ్గించాయి. మళ్లీ నెల తరువాత అంటే ఇప్పుడు ఆ ధరలను ఏకంగా రూ. 209 పెంచింది.
ఇదిలాఉంటే.. ఆగష్టులో దేశ వ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ లిండర్ల ధరను రూ. 200 తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ తగ్గింపు ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. ఎల్పిజి సిలిండర్ ధరలను తగ్గించిన నెల తరువాత వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. దాంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ కొనుగోలు దారులపై భారం పడనుంది.
కాగా, పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల ప్రకారం.. ఆయా నగరాల్లో వేరు వేరు ధరలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెంచిన ధరతో కలిపి గ్యాస్ సిలిండర్ ధర రూ. 1731 ఉంది. కోల్‌కతాలో రూ. 1839, మొంబైలో గ్యాస్ సిలిండ్ ధర రూ. 1684కు చేరింది. చెన్నైలో సిలిండర్ ధర రూ. 1898కి చేరింది. ఇక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో రూ. 901, కోల్‌కతాలో రూ. 945, ముంబైలో రూ. 926, చెన్నైలో రూ. 902 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర స్థిరంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సిలిండర్ ధర రూ. 960 ఉంది.