మునగపాక పిబ్రవరి 9 (ఆంధ్ర పత్రిక) ; మండలంలో గ్యాస్ పైప్ లైనుకు ఏపి జిడిసి సేకరిస్తున్న భూములకు రైతులకు ధర ఆమోదం కాకుండానే, భూముల డాక్యూమెట్లు ఇవ్వాలని, రైతులను భేదిరింపులకు, వత్తిళ్లకు గురిచేస్తున్నారని, పరిహారంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, అప్పటివరకు భూములిచ్చేది లేదని ఏపి రైతు సంఘం,సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. సెంటుకు 1లక్ష ఇవ్వాలని, పంటకు 10 ఏళ్ళు పరిహారం ఇవ్వాలని,కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పైప్ లైన్ వెళ్లే గ్రామాల కుటుంబానికి 50 లక్షల ఇన్సూరెన్స్ చేయాలని సీపీఎం నాయకులు ఎస్. బ్రహ్మజీ డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చిన తరువాతే రైతుల వద్దకు రావాలని, బలవంతపు భూసేకరణ కు దిగితే ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం తాసిల్దార్ వినయ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మునగపాక, తిమ్మరాజు పేట, మూల పేట గ్రామాల రైతులు, సీఐటీయూ నాయకులు వి వి శ్రీనివాసరావు, దొడ్డి నాగ భూషనం, ఆడారి సాంబమూర్తి,మళ్ళా సత్యనారాయణ, ఆడా రి నూకరాజు, మళ్ళ శివ, మళ్ళ ప్రసాద్, సరగడం పరదేసిరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!