మరమ్మతుకు సమాయత్తం
సంపద కేంద్రాల నిర్వహణలో అలసట తగదు ఎంపీడీఓ డి.సీతారామరాజు
నక్కపల్లి, అక్టోబర్ 19, (ఆంధ్రపత్రిక) : మండల కేంద్రం నక్కపల్లి లో చెత్త నుండి సంపద కేంద్రం మరమ్మతుకు మండల పరిషత్ అధికార గణం సహా పంచాయతీ పాలకవర్గం బుధవారం నాడు సమాయత్తమైంది.స్థానిక సచివాలయంలో అధ్వాన్నంగా వున్న చెత్త నుండి సంపద కేంద్రాన్ని పరిశీలించిన ఎంపిడిఓ సీతారామ రాజు, ఈఓపిఆర్డీ వెంకట నారాయణ లు ఇక్కడి సంపద కేంద్రం అధ్వాన్న పరిస్తితి గురించి జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపిన మీదట ఆయా పంచాయతీ నిధుల నుంచి తక్షణం మరమ్మతు పనులు చేబట్టాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపిడిఓ కార్యాలయానికి ఆదేశాలు అందాయి.దీనిపై స్పందించిన మండల పరిషత్ అధికార గణం వున్నపళంగా షేడ్ పునర్నిర్మాణం పనులు చేబట్టాలని సంబంధిత పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ వెంటనే షెడ్ వద్ద పరిశుభ్రత,నిర్మాణం సహా అభివృద్ధి పనులు చేబట్టారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ వీశం రాజు అధ్వర్యంలో చెత్త నుండి సంపద కేంద్రం మరమ్మతు,పునర్నిర్మాణం పనులు చేబట్టారు.ఈ కార్యక్రమంలో బాగంగా అమలు జరుగుతున్న మరమ్మతు పనుల తెరుతెన్నులను ఎంపిడిఓ సీతారామ రాజు,ఈఓపిఆర్డీ వెంకట నారాయణ పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు, కార్యదర్శి రాజశేఖర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.