Bigg Boss Season 8 – Gangavva: బిగ్ బాస్ సీజన్ 8.. సెప్టెంబర్ 1వ తేదీ ప్రారంభమైన ఈ సీజన్ లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. ఐదు వారంలోకి చేరుకున్న ఈ సీజన్ లో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 2.ఓ గ్రాండ్ లాంచ్ ఉండబోతుంది.
ఇక ఈ 2.ఓ కు మాజీ కంటెస్టెంట్స్ ను తీసుకురాబోతున్నారు. సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఒక్కో సీజన్ లో ఒక్కొరిని తీసుకురానున్నారు.. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్నీ ఫిక్స్ అయిపోయాయి..
సీజన్ 1 నుంచి హరితేజను, బిగ్ బాస్ సీజన్ 7 నుంచి నయని పావనిని, బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ముక్కు అవినాష్ ను, సీజన్ 5 నుంచి యాంకర్ రవిలు వైల్డ్ కార్డు ఎంట్రీస్ గా ఫిక్స్ అయ్యారు. ఇక వీరు కాకుండా సీజన్ 7 నుంచి డాక్టర్ బాబు గౌతమ్ ఎంట్రీ కూడా ఫిక్స్ అనే టాక్ వినిపిస్తుంది. వీళ్ళ సంగతి పక్కన పెడితే.. సీజన్ 4 నుంచి ఆరోగ్యం బాగోలేక వెళ్లిపోయిన గంగవ్వను మళ్లీ తీసుకురానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
గంగవ్వ సీజన్ 4లో ఎంట్రీ ఇవ్వగా.. ఆమె వల్ల మిగిలిన కంటెస్టెంట్స్ పూర్తిగా గేమ్ ఆడలేకపోయారు.. ఆమెకోసం త్యాగాలు చేస్తూ పరిగెత్తారు. ఇక ఆమెనే ఆ హౌస్ లో ఉండలేక కొన్ని వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అలాంటి గంగవ్వను సీజన్ 8 2.ఓ లోకి తీసుకురానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై నెటిజన్స్ మాత్రం గంగవ్వ బిగ్ బాస్ కు రావడం అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరీ గంగవ్వ బిగ్ బాస్ హౌస్ కు రావడంపై మీ అభిప్రాయం ఏమిటి?