హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగుతోంది. వేలాది గణపతులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. 24 గంటలుగా ఆటంకం లేకుండా యాత్ర కొనసాగుతూ వస్తోంది. ట్యాంక్‌బండ్‌పై ఇంకా హడావుడి కనిపిస్తోంది. భారీ గణేషుల శోభాయాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. హుస్సేన్ సాగర్ దగ్గర గణనాథుల విగ్రహాలు బారులు తీరాయి. నిమజ్జనం త్వరగా పూర్తి చేసేందుకు పోలీసుల కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు నగరంలో 80 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యింది.
హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగుతోంది. వేలాది గణపతులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. 24 గంటలుగా ఆటంకం లేకుండా యాత్ర కొనసాగుతూ వస్తోంది. ట్యాంక్‌బండ్‌పై ఇంకా హడావుడి కనిపిస్తోంది. భారీ గణేషుల శోభాయాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. హుస్సేన్ సాగర్ దగ్గర గణనాథుల విగ్రహాలు బారులు తీరాయి. నిమజ్జనం త్వరగా పూర్తి చేసేందుకు పోలీసుల కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు నగరంలో 80 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యింది. నగరవ్యాప్తంగా లక్షకు పైగా గణనాథులు కొలువుతీరినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. కాగా, ఓవైపు వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుండగానే.. మరోవైపు క్లీనింగ్ ప్రాసెస్కూడా పూర్తి చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.
తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లక్డికపుల్, సికింద్రాబాద్, ట్యాంక్‌బండ్, అబిడ్స్, అంబేద్కర్ విగ్రహం, బషీర్ బాగ్ వైపు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంచి గంట తరువాత ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు వాహనాలను అనుమతిచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. మరోవైపు నారాయణగూడ సహా శంకర్ మఠ్ వైపు ట్రాఫిక్ కొనసాగుతోంది. ఆయా మార్గాల్లో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.