జాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీజీ నేర్పారని, చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహ సోపేతమని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ తెలి పారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతి థిగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ ‘నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీ నేర్పారు. చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహ సోపేతం. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు జరి గాయి. చాలావరకు హింసాపూరిత వాతావ రణంలోనే సాగాయి. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాడిన విషయం తెలిసిందే. సత్య శోధన పుస్తకం ద్వారా గాంధీని మరోసారి గుర్తు చేసుకుం టున్నాం. గాంధీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయం అన్నారు. మహాత్మా గాంధీజీ రెండుసార్లు తిరుపతికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1921లో మొదటిసారి, 1933లో రెండోసారి ఆయన తిరుపతికి వచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నాకు ఆప్తమిత్రుడు, అపూర్వ సహౌదరుడు. ఆయన్ను పార్టీలు సరిగా ఉపయోగించుకోలేదు. తెలుగు భాష, సంస్కృతి పట్ల ఆయనకు మక్కువ ఎక్కువ. చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు అని సీజేఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.గాంధీజీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందని ఎన్వీ రమణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సత్యశోధన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ సేవలను కొనియాడారు. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాటం చేసారని.. నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించిన వ్యక్తం గాంధీజీ అని అన్నారు. ఇదిలావుంటే రాస్ నిర్వాహకులు, పద్మశ్రీ గ్రహీత స్వర్గీయ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ… ఎన్.జీ.రంగ, వివోభాబావే, రాజగోపాలనాయుడు వంటి స్వాతంత్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పని చేసిన వ్యక్తి మునిరత్నం అని తెలిపారు. మహిళలు, రైతులకు రాస్ సంస్థ ద్వారా సేవలు అందాయన్నారు. సంస్థ మరింత అభివృద్ది చెందాలని సీజేఐ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. అంతకుముందు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉదయం తిరుమల శ్రీవారిని సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో సీజేఐకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!