విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడి
న్యూఢల్లీి, డిసెంబర్ 1 (ఆంధ్రపత్రిక): భారత్కు మరో ఘనత దక్కింది. ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జీ`20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జీ`20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు. డిసెంబరు 1 నుంచి జీ`20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ప్రకటించారు. ప్రపంచంలో అనేక రాజెకీయ సవాళ్లు ఉన్నాయని భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ అన్నా రు. ఈ సమయంలో భారత్ జీ`20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. తీవ్రవాదం, నల్లధనం కట్టడిపై భారత్ స్పష్టతతో ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి జీ`20 ఉపయోగపడుతుందన్నారు. ఢల్లీిలో జరిగిన జి20 యూనివర్సిటీ కనెక్ట్..ఎంగేజింగ్ యంగ్ మైండ్స్ ఈవెంట్ లో జైశంకర్ మాట్లాడారు. ఏడాది పాటు భారత్ జీ`20 అధ్యక్ష పదవిలో కొనసాగనుండగా.. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో పలు అంశాలపై 200 సమావేశాలను నిర్వహించనున్నారు. జీ`20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు.దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శిం చనున్నారు. ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు. 2023 సెప్టెంబర్ లో జరిగే జీ20 సమావే శాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ జీడీపీలోజీ 20 దేశాలు 85 శాతాం వాటాను కల్గి ఉండగా….జనాభాలో రెండిరతలు ఈ జీ20 దేశాల్లోనే ఉన్నారు.