నవంబర్ 18 (ఆంధ్రపత్రిక): టు సౌత్, అటు బాలీవుడ్లో ఇటీవల వరుస ప్రేమ వివాహాలు జరుగుతున్న క్రమంలో తమన్నా కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌ను తమన్నా పెళ్లి చేసుకోబోతోందని, సినిమాలు తగ్గించడానికి కారణం ఇదేనని గత వారం రోజులుగా చాలా వార్తలొచ్చాయి. ఈ పెళ్లి కబుర్లు తమన్నాకు కూడా చేరడంతో.. సోషల్ విూడియా ద్వారా క్లారిటీ ఇచ్చిందామె… ’వ్యాపారవేత్త అయిన నా భర్తను పరిచయం చేస్తున్నాను.. అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఉన్న ఆ బిజినెస్ మ్యాన్ మరెవరో కాదు.. ’ఎఫ్ 3’ సినిమాలో కాసేపు మేల్ గెటప్‌లో నటించిన తమన్నానే. ఆ వీడియోకి ’మ్యారేజ్ రూమర్స్… ప్రతి ఒక్కరూ నా జీవితానికి సంబంధించిన స్క్రిప్ట్ రాస్తున్నారు’ అనే క్యాప్షన్స్ జోడిరచింది. మొత్తానికి తన పెళ్లి వార్తలను ఖండిరచడమే కాక, తనపై గాసిప్స్ క్రియేట్ చేసిన వారికి ఇలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది తమన్నా. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె.. ప్రస్తుతం చిరంజీవికి జంటగా ’భోళా శంకర్’లో నటిస్తోంది. సత్యదేవ్‌తో కలిసి నటించిన ’గుర్తుందా శీతాకాలం’ రిలీజ్ కావలసి ఉంది. హిందీ, మలయాళ భాషల్లోనూ ఆమె నటిస్తోంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!