జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, ఫిబ్రవరి 7 (ఆంధ్రపత్రిక) : మహిళలు, చిన్నారులలో పౌషకాహార స్థితిని మెరుగుపరిచేలా వైవిధ్య పరమైన ఆహారాన్ని తీసుకునేలా అవగాహన కల్పించేందుకు టాటా ట్రస్ట్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థల సహకారంతో నిర్వహించే ఎస్ టూ పోషన్ ప్రాజెక్టు కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. జిల్లాలో మహిళలు, పిల్లలలో పౌషకాహార స్థితిని పెంపొందించి పోషకాహార లోపాన్ని నివారించేందుకు విజయవాహిని చారిటబుల్ పౌండేషన్, టాటా ట్రస్ట్ సహకారంతో పిఅండ్ హెల్త్ కేర్ సేవలతో జిల్లాలో చేపట్టే ఎస్ టూ పోషన్ ప్రాజెక్టు అమలు పై మంగళవారం నగరంలోని కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డిల్లీరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మైలవరం మండలంలోని గణపవరం, వెల్వడం, సబ్జాపాడు, దాసులపాలెం, కొత్త గూడెం గ్రామాలలో పైలట్ ప్రాజెక్టుగా ఎస్ టూ పోషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సహకారంతో పోషకాహార ఫలితాలను పెంచేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ఆహారాన్ని వండే విధానంలో పోషక విలువలు నష్టపోకుండా మహిళలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎత్తుకు తగ్గ బరువు, బరువుకు తగ్గ ఎత్తు కలిగిన పిల్లలను గుర్తించి వారిలో వైవిధ్యాన్ని నివారించి అదనపు పోషకాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. పిల్లలలో ఎదుగుదల లేకపోవడం, పోషకాహరలోపం, తక్కువ బరువుతో పుట్టడం, గర్భణిలు, బాలింతలు, చిన్నారులలో రక్తహీనతను నివారించేందుకు ఎస్ టూ పోషన్ ఉపయోగపడుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, వ్యక్తిగత గృహాలలో 100కు పైగా న్యూట్రీ గార్డెన్లను ప్రోత్సహించడం ప్రాజెక్టలలో ఉన్నాయన్నారు. స్వదేశీ, పోష్టికాహర వంటకాలను ప్రోత్సహించేందుకు ఆచార్య ఎన్టి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం భాగస్వామ్యం కలిగి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎస్ టూ పోషన్ ద్వారా చేపట్టే ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.కార్యక్రమంలో ఆచార్య ఎన్టి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పోషక సహిత వంటకాలతో హోంసైన్స్ విభాగం రూపొందించిన రెసిపి పుస్తకాన్ని ఆవిష్కరించారు.సమావేశంలో టాటా ట్రస్ట్ న్యూట్రిషన్ అసోసియేట్ డైరెక్టర్ డా. సుజీత్ రంజన్, టాటా ట్రస్ట్ పార్టనర్ షిప్ టీమ్ సభ్యులు కావేరి, కృష్ణన్, టాటా ట్రస్ట్ రిజనల్ మేనేజర్ రాజేంద్రబాబు, ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫిసర్ డా. కె. లక్ష్మి, ప్రాజెక్ట్ ఆఫీసర్ కె. శ్రీనివాస్, ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, సిడిపివో పుష్పలత, పోక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్ ఆఫీసర్ క్యాస్మిలో, టాటా ట్రస్ట్ న్యూట్రిషియన్ లీడ్ మధుసూదన్, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!